![]() |
![]() |

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -65 లో చిన్ని దగ్గరికి గంగ వెళ్తుంది. మాట్లాడుతుంటే వీరు మనిషి గంగ తన అమ్మ ఫోటో పంపిస్తాడు. వెంటనే గంగ అతనికి ఫోన్ చేసి మా అమ్మకి ఏమైందని అడుగుతుంది. మీ అమ్మ ఇక్కడ పడి ఉంది. తన దగ్గరున్న కాగితం లో నీ నెంబర్ ఉంటే ఫోన్ చేసానని అతను చెప్తాడు. దాంతో చిన్నికి మళ్ళీ వస్తానని చెప్పి గంగ బయటకి వస్తుంటే .. రుద్ర ఎదురుపడతాడు.
నువ్వు నీ ఫ్రెండ్ ని కలిసి రా.. మనం పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలని రుద్ర అంటాడు. సరే సర్ మా ఫ్రెండ్ ని కలిసి వస్తానని వెళ్తుంది కానీ వాళ్ళ అమ్మ గురించి చెప్పదు. చిన్ని దగ్గరికి రుద్ర వెళ్లి మాట్లాడతాడు. అప్పుడే మీటింగ్ స్టార్ట్ అవుతుంది. చిన్నిని తీసుకొని రుద్ర మీటింగ్ దగ్గరికి వెళ్తాడు. మరొకవైపు వాళ్ళ అమ్మ దగ్గరికి గంగ వెళ్ళబోతూ.. రుద్ర అన్న మాటలు గుర్తుచేసుకుంటుంది. నీ బలహీనత అయిన నీ అమ్మని ఆయుధంగా చేసుకుని నీ శత్రువులు వాడుకుంటారు. ఏదైనా ఆలోచించాలని రుద్ర చెప్పిన మాటలు గుర్తుచేసుకొని ఆగిపోతుంది.
గంగ అతనికి ఫోన్ చేసి మా అమ్మ నీ దగ్గర లేదు.. నీ వేషాలు నాకు తెలుసు.. ఇంకొకసారి ఇలా చేస్తే రుద్ర సర్ కి చెప్తానని గంగ అతనికి వార్నింగ్ ఇస్తుంది. మరొకవైపు మీటింగ్ లో చిన్నిని చదివిస్తున్న రుద్ర స్టేజిపై మాట్లాడతాడు. అది చూసి గంగ షాక్ అవుతుంది. అంటే నా రాజకుమారుడు రుద్ర సర్ ఆ అని గంగ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |